ఝూటా మాటల బీజేపీ బాగోతం ఇదే..

251
harish rao
- Advertisement -

రాష్ట్ర బీజేపీ నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేసారని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఝూటా మాట‌ల బీజేపీ చిట్టాను బ‌య‌ట‌పెట్టారు. సిద్దిపేట‌లో మంత్రి హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడారు. పూటకో పుకారు పుట్టిస్తారు గంటకో అబద్ధం ఆడేస్తారు ఇదీ బిజీపి నాయకుల నైజం అని మండిపడ్డారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని సామెత. కానీ బీజేపీ మాత్రం దుబ్బాకలో వెయ్యి అబద్దాలాడైనా ఒక ఎన్నిక గెలవాలె అనే కొత్త సామెతను సృష్టిస్తున్నదని మంత్రి ఎద్దేవ చేశారు. ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క బీజేపీ నాయకుడు నిజం మాట్లాడటం లేదు. అబద్ధాలే పునాదిగా బీజేపీ తప్పుడు ప్రచారాలకు తెరతీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకొని గ్రామస్థాయి వార్డు నాయకునిదాకా అందరూ అబద్ధాలు ఆడేవారే. అసత్యమే వారి ఆయుధం. వ్యక్తిగత దూషణలు వారి నైజం అని మంత్రి హరీష్‌ విమర్శించారు.

భారతీయ సాంప్రదాయానికి తామే ప్రతినిధులుగా చెప్పుకునే బిజెపినాయకులు “సత్యమేవ జయతే” అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారు. “అసత్యమేవ జయతే” అనే వారు నమ్ముతున్నారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్కపెట్టినట్టు నేను బీజేపీ నేతల అబద్ధాలను లెక్కపెడుతున్న.. వాటిలోంచి కొన్ని మీ ముందు పెడుతున్నా.. అని మంత్రి హరీష్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

◆ ఝూటా నంబర్ 1 :

  • – టియారెస్ ప్రభుత్వం, బీడీ కార్మిక మహిళలకు ఇస్తున్న పెన్షన్ 2016 రూపాయలలో, 1600 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు అని అన్నారు.
  • – పట్ట పగలు పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటే నిజాలు నిగ్గు తేల్చాలని నేను సవాలు విసిరాను. అంతే తోక ముడిచారు.
    – కాంగ్రెస్ పెట్టిన పుర్రె గుర్తుతో బీడీల అమ్మకాలు తగ్గినాయి.
  • – బీడీల అమ్మకాలపై బిజెపి ప్రభుత్వం 18 శాతం జి ఎస్ టి విధించడం వల్ల బీడీల అమ్మకాలు మరింత పడిపోయినయి.
  • – ఈరోజు బీడీ కార్మికులకు 15 రోజుల పని కూడా దొరుకడం లేదు.
    – ఉన్న పనిని పోడగొట్టిన బి జే పి, కాంగ్రెస్ లు బీడీ కార్మికుల చాటల మన్ను పోసినయి.
  • – టిఆరెస్ 2016 రూపాయల పించన్ ఇచ్చి బీడీ కార్మికులను కడుపుల పెట్టి చూసుకుంటున్నది.

◆ ఝూటా నంబర్ 2 :

  • – కేసీఆర్ కిట్ పథకం కింద ఇచ్చే డబ్బు 13 వేలలో 6 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందని ఒకరు, 8 వేలు ఇస్తుంది అని ఇంకొకరు అబద్ధాలు చెప్తున్నారు.
  • – అబద్ధం కూడా తలోరకంగా చెప్తున్నారు.
  • – నిజానికి ఇందులో కేంద్ర ప్రభుత్వంది నయా పైసా లేదు.
  • – 100 శాతం టిఆరెస్ ప్రభుత్వమే ఇస్తున్నది.

◆ ఝూటా నంబర్ 3:

  • -గొర్రెల యూనిట్లలో 50 వేలు బిజెపి ఇస్తుంటే కేవలం 25 వేలే టియారెస్ ఇస్తున్నది.
    -ప్రజలను గొర్రెలుగా భావించే వారే ఇటువంటి అబద్ధాలు చెప్పగలరు. ఈ పథకం ఖర్చు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. బి జే పి నాయకులకు యూనిట్ కాస్ట్ కూడా తెలియదు. అంటే అబద్ధమే కాక అజ్ఞానం తో కూడిన అబద్ధం.
  • -యూనిట్ కాస్ట్ మొత్తం ఒక లక్షా ఇరవై ఐదు వేలు. ఇందులో లబ్దిదారుని వాటా 25 శాతం అంటే 31,250 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 75 శాతం అంటే 93,750 రూపాయలు ఇది కూడా తెలియ కుండా నోటి కొచ్చిన అబద్ధం చెప్పేస్తున్నారు.ఇప్పటి వరకు 77 లక్షల గొర్రెలను 3,70,000 మంది గొల్ల కుర్మ సోదరులకు పంపిణీ చేసింది.

◆ ఝూటా నంబర్ 4:

  • – కేంద్రం 25 కోట్లతో ఇఎస్ఐ హాస్పిటల్ చేగుంట కు మంజూరు చేస్తే టియారెస్ దాన్ని గజ్వేల్ లో పెట్టుకున్నది. గజ్వేల్ ల ఇఎస్ఐ హాస్పిటల్ లేదు
    – చేగుంటకు శాంక్షన్ అయింది లేదు. ఉంటే కాయిదం చూపించండి.ఇంత గాలి మాటలా ?

◆ ఝూటా నంబర్ 5:

  • – రేషన్ బియ్యం సబ్సిడీ లో కిలోకు 29 రూపాయలు కేంద్రం భరిస్తుంటే కేవలం 1 రూపాయి మాత్రమె టియారెస్ ప్రభుత్వం భరిస్తున్నది.
  • – ప్రజలు తినే అన్నం మీద అబద్ధం.. ఉత్త గోబెల్స్ ప్రచారం.
  • – కేంద్రం ఇచ్చేది సగం కార్డులకే. మిగతా సగం కార్డుల సబ్సిడీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. వారు చెప్తున్న మాట గనుక నిజం అయితే సగం కార్డులు రద్దయి పోతాయి. వారిచ్చే ఆ సగం కూడా 3 రూపాయలకు కిలో చొప్పున. రెండు రూపాయల భారాన్ని భరించి రాష్ట్ర ప్రభుత్వం ఒక
  • – రూపాయికే కిలో చొప్పున ప్రజలకు ఇస్తున్నది. కేంద్రం ఐదు కిలోలకే సబ్సిడీ ఇస్తే రాష్ట్రం ప్రజలకు ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నది. అంటే వారిచ్చే సగం లోనూ ఒక కిలో భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.

ఝూటా నంబర్ 6:

  • – పాలిటెక్నిక్ కాలేజ్ కు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారు.
  • – మంజూరు కాలేదు, శంకుస్థాపన అంతకంటే కాలేదు, సిద్దిపేటకు తీస్కపోలేదు.

◆ ఝూటా నంబర్ 7:

  • – కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు.
  • – ఇది చోర్ ఉల్టా కోత్వాల్ కు డాటా అన్నట్టు ఉన్నది.
  • – విద్యుత్తు సంస్కరణల బిల్లు తెచ్చింది వాళ్ళు – 2,500 కోట్లు ఎర వేసింది వాళ్ళు.
  • – ప్రలోభాలు తిరస్కరించి, బిల్లును వ్యతిరేకించింది కేసీఆర.
  • ◆ ఝూటా నంబర్ 8:
  • – తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం 5,500 కోట్లు విడుదల చేసింది.
  • – ఇది పచ్చి బూటకం. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఎన్ సి డీ సి నుండి వడ్డీతో కూడిన అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎన్ సి దీ సి బెరుగా పౌర సరఫరాల శాఖకు అనుమతి ఇవ్వదు.రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే మాత్రమె ఆ ఆప్పు ఇస్తుంది. వడ్డీరేటు ఇతర జాతీయ బ్యాంకుల కన్నా ఎక్కువ. కనుక ఆ అప్పు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు.
  • ◆ ఝూటా నంబర్ 9:
  • – డబ్బులు దొరికిన ఇల్లు మావాళ్ళది కాదు.
  • – మీవాళ్ళది కానప్పుడు నువ్వెందుకు ఉలిక్కిపడ్డవు ?
  • – దుబ్బాక లో ప్రచారం ఆపేసి 20 నిముషాల్లో సిద్ధిపేట చేరుకొని ఆ ఇంటిముందు హడావిడి ఎందుకు చేసినావు.

◆ ఝూటా నంబర్ 10:

  • – మాకు సంబంధించిన ఎనిమిది మంది ఇండ్ల మీద పోలీసులు దాడులు చేసి సోదాలు చేసారు.
  • – ఉపఎన్నికలలో ఝూటా స్టార్ గా నిలిచింది రఘునందన్ రావు.
  • – ఒకే సంఘటన పై మూడు అబద్ధాలు.. నాలుగు ఇండ్ల లోనే సోదాలు- 2 టియారెస్ వాళ్ళవి- 2 బిజెపి వాళ్ళవి.

◆ ఝూటా నంబర్ 11:

  • – సోదాలో దొరికిన డబ్బులు పోలీసులే పెట్టారు.
  • – అడ్డంగా దొరికి పోయి, పైనుంచి అబద్ధం.
  • – డబ్బులు తమవేనని స్వయంగా రఘునందన్ అత్తామామలు చెప్పిన వీడియోనే రుజువు.

● బీజేపీ ఎంపీలు గెలిచిన చోట అభివృద్ధి శూన్యం.
● బాండ్ పేపర్ మీద వాగ్దానాన్ని రాసిచ్చిన ఎంపీ, పసుపు బోర్డు తేలేదు. పసుపు రైతుల బాధ తీర్చ లేదు.
● కరీంనగర్ ఆదిలాబాద్ లలో ఏమి అభివృద్ధి జరిగింది?
● జనానికి వీళ్ళ అసలు స్వరూపం అర్థమైంది.
● నియోజక వర్గ కేంద్రాలలోని కార్పోరేషన్లు మున్సిపాలిటీలు టియారెస్ గెలుచుకున్నది.
● అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ గనుక ఉంటే అది ఖచ్చితంగా బిజెపికే దక్కుతుంది అని నేను ఘంటా పథంగా చెప్పగలను.
● అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు అభివృద్ధి చేయకపోగా మరిన్ని అబద్దాలతో మోసం చేస్తారు.
● దుబ్బాక ప్రజలారా మోసపోతే గోస పడుతాం. తస్మాత్ జాగ్రత్త.

- Advertisement -