తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారు- మంత్రి హరీష్‌

69
- Advertisement -

సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం ప్రారంభించినా దిక్సూచిగా నిలబడ్డాయి. పింఛన్లు ఇస్తున్నాము.. ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాము..రైతు బంధు, రైతు బీమా, దళిత బందు ఇలా ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం.. 2014లో తెలంగాణనే రాకపోతే ఈ అభివృద్ధి సాధ్యం అయ్యేనా.. తెలంగాణ వచ్చిందని మనం సంతోష పడితే ప్రధాని మోడీ ఎందుకో దుఃఖ పడుతున్నాడు అన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈరోజు ఆయన సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ లోని పోతారం జే గ్రామంలో దళిత బందు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కసు వెళ్లగక్కుతాడు ప్రధాని మోదీ.. ద్వేషం చిమ్ముతాడు. ఆంధ్ర తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట.. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారు..తెలంగాణ బాగుపడుతుంది.. కానీ మోడీకి నచ్చడం లేదు. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నము అని భయమా..? తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగుపడ్డము..1999లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు.. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారు. సుఖ ప్రసవం చేయంగ వద్దు అన్నమా.. ఎందుకు మాట ఇచ్చి తప్పినవ్..? అని మంత్రి ప్రశ్నించారు.

సమాఖ్య స్పూర్తికి విరుద్ధం విభజన అని ఎలా అంటారు.. ఈ స్ఫూర్తితో ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారు.. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రికి కలిపేశారు..కనీసం మాట చెప్పకుండా చేసి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు. తెలంగాణ ఏర్పడితే మీకు వచ్చిన బాధ ఏమిటి..పెప్పర్ స్ప్రే మధ్య బిల్లు పాస్ అయ్యిందట. ఎట్లా పాస్ అయుతే ఏంటి.. కాకినాడ తీర్మానం ప్రకారం మీరు ఆనాడే తెలంగాణ ఇస్తే అంత మంది బలిదానాలు జరిగేవా.. అని హరీష్‌ మోదీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆ నాడు కామన్ మినిమము ప్రోగ్రాంలో పెట్టింది. 2004 లోనే తెలంగాణ ఇస్తే ఇంత మంది విద్యార్థులు అమరులు అయ్యేవారా.. శ్రీకాంత చారి అమరుడు అయ్యేవాడా..?? యువకుల బలిదానాలకు కారణం ఈ బిజెపి, కాంగ్రెస్ పార్టీ..వందల ప్రాణాలు పోడానికి కారణం మీరు.. ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం, తెలంగాణ ఆలస్యం వల్ల యువకులు చనిపోయారని మంత్రి గుర్తు చేశారు.

మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా మోడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న. తెలంగాణ, బిజెపి నాయకులు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతారు. పార్లమెంట్ లో విబజన చట్టంలో చెప్పినవి అమలు చేయరు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ ఎక్కడ పోయాయి.. వెనుక బడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు. మోడీ..చేసేది అన్యాయం.. చెప్పేది శ్రీరంగ నీతులు.. తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారు.. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచింది. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నది. ఆయనకున్న అక్కసును వెళ్లగక్కారు.. తెలంగాణ ప్రజలు గమనించాలి అని మంత్రి అన్నారు.

బిజెపి ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది.. రాష్ట్రానికి 5000 కోట్లు రావాలనంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని బడ్జెట్ లో షరతు పెట్టారు. అంటే బాయిల కడా మీటర్లు పెట్టాలి.. ముక్కు పిండి పైసలు వసూలు చేయాలి. నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్ట.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ డీజిల్ ధర పెంచింది..ఎరువుల ధర పెంచింది.. బాయిల కాడ మీటర్లు పెట్టుమంటున్నది. యూపీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ డీజిల్, పెట్రేల్ భారం తప్పదు. దళిత బంధు దేశానికి ఆదర్శం. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు మంత్రి హరీష్‌.

- Advertisement -