అమ్మా మాస్క్ మస్ట్.. ఇదిగో మాస్క్ పెట్టుకో- మంత్రి హరీష్‌

19

అమ్మా…మాస్క్ మస్ట్.. ఇదిగో మాస్క్ పెట్టుకో.. ఇప్పుడే తీసాం సార్.. ఎప్పుడూ తీయవద్దమ్మా…మాస్క్ మస్ట్‌గా పెట్టుకోవాలి. కరోనా కట్టడికి మాస్క్ తప్పని సరిగా ధరించాలి. ఏ మాత్రం అలక్ష్యం వద్దు‌. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మాస్క్ ధరించాలి అంటూ మాస్క్‌లు‌ లేని వారికి తన వద్ద ఉన్న మాస్క్‌లు పంపిణీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సంఘటన చైతన్య పురిలో ఓ ప్రయివేటు ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది‌.

మంత్రి హరీష్‌ రావు కారు దిగినప్పటి నుండి మాస్క్ లేని వారు కనిపిస్తే తన వద్ద ఉన్న మాస్క్ లు అందజేశారు. దీంతో పాటు అక్కడ ఉన్న వారితో‌ సంభాషించారు. రెండు డోసుల‌ టీకా వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు‌. ప్రభుత్వం రేపటి నుండి అరవై ఏళ్లు దాటిన వారికి మూడో డోస్, బూస్టర్ డోస్ ఇస్తుందని చెప్పారు మంత్రి. ఇలా ఓ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో పాటు, కరోనా జాగ్రత్తలు చెప్పడంతో వారంతా ఈ ఊహించని పరిణామానికి ఆనందం వ్యక్తుం చేశారు.