ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా..

26

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.