ముగ్గుల పోటీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌..

17

రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల అకౌంట్లలో 50వేల రూపాయలు జమ చేసిన గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులతో సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆట ఆడి, ముగ్గుల పోటీలో భాగంగా ముగ్గులు వేశారు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్. మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.