సిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేట కావాలి- మంత్రి హరీష్

485
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా:పట్టణ పరిధిలోని గాడిచర్లపల్లిలో మహిళా మండలి భవన్ మరియు అంగన్వాడి భవనలను ప్రారంభించి తడి, పొడి చెత్త బుట్టలు, జూట్ బ్యాగులు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేట కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా ఆలోచన.

ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు ఇస్తున్నాం, తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలి, అప్పుడే సిద్దిపేట శుభ్రంగా ఉంటుంది.పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కలెక్షన్ ఇస్తాం.ఈ గ్రామంలో మిగిలిన రోడ్డు పనులను నెలలో పూర్తి చేస్తాం.ప్లాస్టిక్ సంచులు వాడవద్దు వాటికి బదులు స్టీల్ డబ్బాలు మాత్రమే వాడాలి అని మంత్రి తెలిపారు.

డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేము… మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఏదైనా కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. మన వ్యక్తిగత పరిశుభ్రత మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని ఔషధ మాధురి తీసుకోవాలి కానీ ఇష్ట రీతిలో తీసుకోవద్దు. ప్రతి ఇంటి వద్ద చెట్లను పెంచాలి. త్వరలోనే16.50 కోట్లతో ముస్తాబాద్ చౌరస్తా నుండి గాడిచేర్లపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు మరియు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

త్వరలోనే అద్దంలాంటి రోడ్లన్నీ వేస్తాం ప్రతి ఒక్కరు చెట్లను కాపాడాలి నీటి వృధాను అరికట్టాలి. మన ఇంటితోపాటు గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అవసరమైన వారికి రూపాయి ఖర్చు లేకుండా ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో కంటి పరీక్షలు చేపిస్తాం.. త్వరలోనే 57 ఏళ్లు నిండిన రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మందికి 2000 పింఛన్లు అందిస్తామని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

- Advertisement -