తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడా లేవు- మంత్రి గంగుల

146
minister Gangula Kamalakar
- Advertisement -

హుజురాబాద్‌లో మహిళా సంఘాల సమావేశాల కోసం, పంక్షన్ల కోసం ఇన్నేళ్లు భవనం కావాలని కాళ్లరిగేలా తిరిగారని, ఎప్పుడూ ఈటెల రాజెందర్ మహిళలను పట్టించుకోలేదని ఆవేదన చెందారు మంత్రి గంగుల కమలాకర్.ఈ దుస్థితిని హరిష్ రావు ద్వారా ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లగానే మానవత్వంతో స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే అరఎకరం భూమి, 1 కోటి రూపాయలు మంజూరు చేసారన్నారు. ఈ రోజు సగౌరవంగా వారికి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి గంగుల. మహిళల కోసం వారి కోరికను నెరవేర్చిన హరీష్ రావుకి సాదరంగా కరీంనగర్ జిల్లాకు స్వాగతం పలికారు. ఈ రోజు హుజూరాబాద్ పట్టణంలో మహిళా సంఘాల‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని దీక్షభూని సాదించిన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అధ్బుతంగా డెవలప్ చేసుకుంటున్నామన్నారు. గతంలో కరెంటు కోతలతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, బిడ్డ పెళ్లికొస్తే గుండెలపై భారంతో తల్లి తల్లడిల్లేదన్నారు. సాయం చేయమని పుట్టింటిని, అన్ననీ వేడుకున్న రూపాయి పుట్టే పరిస్థితులు లేవు.. కానీ సీఎం కేసీఆర్ సొంత మేనమామలా కళ్యాణలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చి లక్ష రూపాయలు అందించారన్నారు మంత్రి గంగుల. పెళ్లి మాత్రమే కాదు కానుపు కోసం 13 వేలతో కేసీఆర్ కిట్, ఇంగ్లీష్ మీడియం గొప్ప చదువుల కోసం అత్యధ్బుత గురుకులాల్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ అన్నారు.16 నుండి 261 గురుకులాలను బీసీ బిడ్డలకు అందించిన ఘనత సీఎంది అన్నారు.

మన పండుగైన బతుకమ్మ, దసరలకు చీర పెట్టిన సొంత మనిషి కేసీఆర్ అన్నారు. భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేడని, అందుకే ఎక్కడా తెలంగాణ లాంటి పథకాలు లేవన్నారు. రైతుబందు, రైతుబీమా, బతుకమ్మ చీరలు, ఆసరా ఫించన్లు, 24గంటల కరెంటు, ధళితబందు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణను అత్యధ్బుతంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌కి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పనిచేసే ప్రభుత్వానికి నిరంతం ప్రోత్సాహం ఇవ్వాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

- Advertisement -