గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కొత్త రెవెన్యూ చట్టంపై సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయితీ సెక్రటరీలతో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విషయంలో దశాబ్దాల తరబడిగా వివాదాలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించడంతోపాటు పేదలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందన్నారు. దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత భూసమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు.
ప్రజలు ఎవ్వరికి ఒక్కపైసా ఇవ్వవద్దని,దళారులను నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి గంగుల. ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితంగా, పారదర్శకంగా జరుగుతుంన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, పంచాయతీల ఆస్తుల అసెస్‌మెంట్ విషయంలో కూడా ప్రజా ప్రతినిధులు అవగాహన పెంచుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. చట్టాలపై అవగాహన లేని చాలా మంది పేదలు తమ ఆస్తుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తోందని మంత్రి పేర్కొన్నారు.