ఏపీలో 7 లక్షలకు చేరుకున్న కరోనా కేసులు..

131
ap corona

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరగడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు 6,133 కేసులు నమోదు కాగా… గత 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,577 టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,858 యాక్టివ్ కేసులు ఉండగా… 6,36,508 మంది కోలుకున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరులో 7, కృష్ణాలో 6, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 5, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడపలో 3, పశ్చిమగోదావరి 2, నెల్లూరు 1, శ్రీకాకుళంలో ఒకరు కరోనా కారణంగా చనిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 5869కి పెరిగింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 986 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 888, ప్రకాశం 783, పశ్చిమ గోదావరి 753, గుంటూరు 594, నెల్లూరు 472, కృష్ణా 424, కడప 400, అనంతపురం 333, శ్రీకాకుళం 301, విశాఖపట్నం 277, విజయనగరం 275, కర్నూలు 265 కరోనా కేసులు నమోదయ్యాయి.