బీసీలకు కేసీఆర్ ఆపద్బంధు- మంత్రి గంగుల

223
Minister Gangula
- Advertisement -

కరోనా సంక్షోభంతో ప్రపంచం మెత్తం అతలాకుతలమై అన్ని దేశాల, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలియజేశారు మంత్రి గంగుల కమలాకర్. గత సంవత్సరం కన్నా దాదాపు 1200 కోట్లను బీసీ సంక్షేమ శాఖకు అదనంగా కేటాయించి 5522 కోట్లతో బీసీ సంక్షేమ శాఖ అవసరాల్ని తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రికి పేద, వెనుకబడిన బీసీ వర్గాలపై గల ప్రత్యేక ఆదరణకు, ప్రేమకు ఇది నిదర్శనమన్నారు గంగుల. శాఖా పరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే చర్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆన్‌లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి వివిద పథకాలపై స్పష్టత నివ్వడమే కాకుండా అధికారులకు మార్గదర్శనం చేశారు.

75 బీసీ కులాల ఆత్మగౌరవం ఇనుమడించేలా అనేక పథకాలను రూపొందించామని, ‘కేసీఆర్ ఆపధ్బందు’ పేరుతో అర్హులైన బీసీలకు అంబులెన్సులను అందజేసే కొత్త పథకాన్ని ఎప్రిల్ 27, తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన ప్రారంబిస్తామని ప్రకటించారు. దీంతో పాటు మహిళల స్వావలంబన కోసం వందకోట్లతో మరో నూతన పథకాన్ని ప్రకటించారు మంత్రి. అత్యాదునిక నిఫ్ట్ శిక్షణ పొందిన ఆధునిక యువతులకు దీటుగా తెలంగాణ గ్రామీణ మహిళలకు సైతం అదే నిప్ట్‌లో శిక్షణ అందించడంతో పాటు 25 మంది సభ్యలను యూనిట్‌గా ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరికీ కుట్టుమిషన్లతో పాటు అన్నిరకాల కుట్టు యంత్రాలను అందించనున్నామని తెలియజేసారు మంత్రి గంగుల. వీటితో పాటు గ్రామీణ బీసీలకు అత్యాదునిక వ్వవసాయ యంత్రాలు, కులానికి నికరంగా 5వేల మంది చొప్పున రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, కుమ్మరులకు, మేదరలకు, విశ్వభ్రాహ్మణులకు, సగరలకు, వడ్డెరలకు వారి వారి వృత్తి పనిముట్లను అందించే పథకాల్ని ప్రారంభిస్తున్నామన్నారు.

అలాగే 300 కోట్లతో దాదాపు 50వేల బీసీ యువతీ, యువకులకు ఎసి రిపేర్, టూ వీలర్ రిపేర్ తదితర వృత్తి శిక్షణలు ఇవ్వడంతో పాటు పనిముట్లు ఇప్పించి స్వయం ఉపాది కల్పించే కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామన్నారు. బీసీల్లోని ప్రతీ వర్గానికి లబ్దీ చేకూరే విదంగా ఈ కార్యక్రమాల్ని రూపొందించామని వీటి విది విదానాలపై ఆయా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాల్ని నిర్వహించి వారి సలహాలు, సూచనలతో ఈ కార్యక్రమాలను ఎప్రిల్ 27న ప్రారంభిస్తామని తెలియజేశారు మంత్రి గంగుల. ఏ గుర్తిపుకు నోచుకోని 17 కులాల్ని బీసీల్లో చేర్చడమే కాకుండా 75 బీసీ కులాలకు 40 ఆత్మగౌరవ భవనాలను 82.30 ఎకరాలలో రూ. 95 కోట్లతో నిర్మించనున్నామని ఇందుకోసం ఈ సంవత్సరం 10 కోట్లు విడుదల చేసామని చెప్పారు మంత్రి గంగుల.

ఇవే కాకుండా విద్యాపరంగా అన్ని బీసీ సంక్షేమ స్కూళ్లలో డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించడంలో ముందున్నామని చెప్పారు మంత్రి గంగుల. దేశంలో ఎక్కడాలేని విదంగా 281 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మన దగ్గర నడుపబడుతున్నాయి. వీటికోసం గతం కన్నా 75 కోట్లు అదనంగా ఇస్తూ మొత్తం 620 కోట్లు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఈ నిధుల ద్వారా 2021-22 విద్యాసంవత్సరం నుండి 119 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి 9520 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నామని అన్నారు. కరోనా ఆపద సమయంలో కూడా రాబోయే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆన్‌లైన్‌లో శిక్షణ ద్వారా 11 బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్ సర్విసెస్, గ్రూప్ 1,2 మరియు ఇతర కేంద్ర, రాష్ట్ర స్థాయి పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. వీటికి అదనంగా ఈరోజే సిరిసిల్లలో మరో నూతన బీసీ స్టడీ సర్కిల్ని మంజూరు చేశామని తెలియజేశారు మంత్రి గంగుల. ముఖ్యంగా ఆడబిడ్డల వివాహానికి ఆసరాగా తెచ్చిన కళ్యాణ లక్ష్మీ పథకానికి రూ. 1850 కోట్లు కేటాయించామని. ఇది గత సంవత్సరం కన్నా 500 కోట్లు ఎక్కువ అన్నారు మంత్రి గంగుల, 2014 సంవత్సరం నుండి ఇప్పటివరకూ 3.50 లక్షల వధువులకు 3,353 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు.

ఈ సందర్భంలో రాబోయే యాసంగి దాన్యం సేకరణ గురించిన వివరాలను సైతం మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ గింజను రైతుల వద్దే కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా శాఖా పరమైన ఏర్పాట్లను వివరించారు మంత్రి, ఇందుకోసం 6408 దాన్యం కొనుగోలు కేంద్రాలు, 20 కోట్ల గన్నీ సంచులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లక్షా ముప్పై రెండువేల మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి అంచనాగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు అవసరమయ్యే 20 వేల కోట్ల కోసం పౌరసరఫరాల సంస్థకు బాంకు గారంటీని సైతం ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రైతు సోదరులు సైతం 17శాతం మించకుండా తేమతో దాన్యాన్ని టోకన్ల వారీగా, కరోనా నిబందనలు అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. రైతు సోదరులకు సౌకర్యార్థం పిర్యాదులు అందించడానికి కంట్రోల్ రూంని ఏర్పాటుచేయడంతో పాటు 1800 425 0033 / 1967 టోల్ ఫ్రి నెంబర్లని సైతం అందుబాటులో ఉంచామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెకరెట్రి బుర్రా వెంకటేశం, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉన్నతాదికారులు అలోక్ కుమార్, మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -