ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దాం- మంత్రి పువ్వాడ

55
Minister Puvvada

ఖమ్మం నగరాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కొత్త ఎన్నికైన మేయర్‌,ఉప మేయర్‌కు సూచించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.సోమవారం జడ్పీ హాలో నిర్వహించిన సమావేశంలో మేయర్, ఉప మేయర్ లకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో కొవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్నందున కార్పొరేషన్ పరిధిలో తగు చర్యలు చేపట్టాలని మంత్రి వారికి సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు మించి మంచి పాలన అందించాలని కోరారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ డివిజన్ల నుండి గెలుపొందిన కార్పొరేటర్లకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.