బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే బాల్క సుమన్..

189
- Advertisement -

బీజేపీ నేత తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారునిపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లోకి కుటుంసభ్యులను లాగడం బీజేపీ విష సంస్కృతి అని బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం..దీని వెనుక బీజేపీ బండి సంజయ్ ఉన్నారు. ఇది ఆ పార్టీ సంస్కృతి. రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పు దెబ్బలు తగులుతాయని బాల్క హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న అలియాస్‌ చింతపడ్డు నవీన్ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే చెప్పుదెబ్బలు తప్పవు. మీరు ఏమీ చేసినా చూస్తూ ఊరుకోవడానికి మా పార్టీ సిద్ధంగా లేదు. నేను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే నేను ఐటి రిటర్న్స్ సమర్పిస్తున్న.. ఎక్కువ ఉన్నట్లు నిరూపించండి అని సవాల్‌ విసిరారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు మేము కంప్లైంట్ చేశాం.. రాష్ట్ర డీజీపీ స్పందించాలి.పోలీస్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తోందని బాల్క నిలదీశారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు అన్నారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ గడ్డిపీకుతున్నారా.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి.. దీనికి బండి సంజయ్ మొదట సమాధానం చెప్పాలి.. దమ్ముంటే బండి, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపండి అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎమ్మెల్యే సుమన్ పేర్కొన్నారు.

- Advertisement -