రేషన్ కార్డుల జారీపై తుది నివేదిక సిద్ధం..

145
gangula
- Advertisement -

రేషన్ కార్డు లు జారీ,నూతన విధివిధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్..కేబినెట్‌లో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ రేషన్ కార్డ్ లపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటి అయ్యాం అన్నారు.

10 రోజుల్లో 4 లక్షల 97 వేలు కార్డ్ లు లపై సీఎం కేసీఆర్ తుది నివేదిక ఇస్తున్నాం …రేషన్ కార్డ్ లో మార్పులు చేర్పులకు కూడా సీఎం కేసీఆర్ నివేదిక ఇస్తాం అన్నారు. రేషన్ కార్డ్ లో పేర్ల ఆడిషన్, డిలీషన్ పై కూడా ఇవాళ సబ్ కమిటీ చర్చింది…వీటి అన్నింటిని సీఎం కేసీఆర్ నివేదిక ఇస్తాం అన్నారు.

డీలర్లకు కమిషన్ పెంచాలని ఎప్పటి నుండో అడుగుతున్నారు దానిపై కూడా నిర్ణయం తీసుకుంటాం…స్మార్ట్ రేషన్ కార్డ్ లు ఇచ్చే అంశంపై కూడా సీఎం కేసీఆర్ ప్రతిపదిస్తాం అన్నారు.1498 రేషన్ షాప్ లు ఖాళీ గా ఉన్నాయి వాటిపై కూడా చర్చించాం…డీలర్ల కమిషన్ పై కూడా సీఎం కు నివేదిక సమర్పిస్తాం.వీటి అన్నింటిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నివేదిక సమర్పిస్తాం అన్నారు.

- Advertisement -