కరోనా సంక్షోభంలోనూ ఆగని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

68
gangula
- Advertisement -

ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్, పద్మాదేవేందర్ రెడ్డి, నోముల భగత్, షకీల్ లు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల సమాధానం చెప్పారు, ఇప్పటివరకూ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ లబ్దీదారులెంత, కేటగీరీల వారీగా వెచ్చించిన నిధులెన్ని అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో 2014-15వ సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పథకాల కింద ఇప్పటివరకూ 9,31,316 మంది ద్వారా కుటుంబాలు లబ్దీపొందాయన్నారు, 2016 నుండి బీసీలకు పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు, ఇప్పటివరకు బీసీ, ఇబిసిలకు 3,834.86కోట్లు, ఎస్టీలకు 877.82కోట్లు, ఎస్సీలకు 1,475.59కోట్లు, మైనారిటీలకు 1,534.53కోట్లు మొత్తంగా ఇప్పటివరకూ 7,720.80 కోట్ల రూపాయల్ని ఈ పథకాల కోసం ఖర్చుచేసామని తెలియజేసారు మంత్రి గంగుల. బిసి సంక్షేమ శాఖతో పాటు, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, షెడ్యూలు కులాల సంక్షేమ శాఖల పరిదిలో లబ్దీదారులున్నారన్నారు.

ప్రపంచంలో ఏ దేశంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మీ, షాధీముభారక్ పథకాలకు రూపకల్పన చేశారన్నారు, ఎవరి బిడ్డైనా, ఆడపడుచులు తెలంగాణ ఆస్థి అని వారికోసం 2014లో 50000లతో ప్రారంభమైన పథకాలు 75,000 తర్వాత 10116 అందిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
తీవ్ర కరోనా సంక్షోభంలోనూ కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలకు నిధులు ఆపలేదని ప్రతి ఒక్క అర్హులకు ఈ పథకాన్ని అందించామన్నారు మంత్రి.

మధ్య దళారుల ప్రమేయం లేకుండా మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులైనా ఎమ్మార్వో ధృవీకరణతో ఆర్డీవో నిర్ధారించిన తర్వాత స్కీం అందజేయడం జరుగుతుందని, ఏ ఒక్క అనర్హునికి ఇచ్చే అవకాశం లేనేలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా అందిస్తున్నామన్నారు.

- Advertisement -