పెళ్లిరోజు.. కన్నీళ్లు పెట్టించిన సామ్

53
sam

పదేళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు చై- సామ్ జోడీ. అయితే రీసెంట్‌గా తమ బంధానికి బ్రేకప్ చెప్పిన సమంత.. ఆ తర్వాత తొలిసారి ఓ పోస్ట్ పెట్టి కన్నీళ్లు పెట్టించింది. విడాకుల ప్రకటన అనంతరం తొలి పోస్ట్ చేసి అభిమానులను బాధతో పలకరించింది . అది కూడా తన పెళ్లి రోజున (అక్టోబర్ 7) .

పాత ప్రేమ పాటలు- పర్వతాలు, శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. ఆ సందులలో గాలి శబ్దం” అంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టింది సామ్. ఈ మేరకు షేర్ చేసిన ఫొటోలో తెల్లని డ్రెస్ ధరించి ఒంటరిగా, తీక్షణంగా నేలవైపు చూస్తూ కనిపిస్తోంది సమంత.