పెండింగ్లో ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రతి బిల్డింగ్కు పూర్తిస్థాయిలో సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఆక్సిజన్ పైప్ లైన్లు, అగ్నిమాపక పరికరాలు, లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్ వంటి సదుపాయాలను టెండర్లలోనే పొందుపరచాలి. వైద్య పరికరాలు, మందులు, బిల్డింగ్ నిర్మాణాల్లో పెండింగ్ బిల్లులు వివరాలను అందజేయాలని మంత్రి కోరారు.
త్వరితగతిన హాస్పిటల్స్ అన్నిటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు మంత్రి. టీచింగ్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అప్ గ్రేడ్ అయిన హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని మంత్రి ఈటెల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలంగాణ వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి రాజేంద్ర కుమార్ లు పాల్గొన్నారు.