కరోనా సోకిన వారిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు మంత్రి ఈటల రాజేందర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి- నివారణ చర్యలు, వైద్య సదుపాయాల పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, మాలోతు కవిత,ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నరేందర్, సీతక్క,ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్ ….కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. నియంత్రణ పెను సవాల్ గా మారింది.అయినా అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకు ఉందన్నారు.ఇప్పుడు కూడ ధైర్యంగా ఈ సవాల్ ను ఎదుర్కొందాం…కరోనా భాదితులకు మరింత మెరుగైన సేవలను అందిద్దాం అన్నారు.
వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.అయినా కొందరు అర్ధం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు.అన్ని రకాలుగా అండ గా నిలిచి కరోన సోకిన వారిని కాపాడుకుందాం అన్నారు.
ఈ కష్ట కాలాన్ని సవాల్ గా తీసుకుని పని చేద్దాం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.నిధులకు కొరత లేదు. ఆసుపత్రిలోని సౌకర్యాల పెంపు కోసమే అధికంగా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారని….ఇబ్బందులను అధిగమించి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.