కోవిడ్ పరిస్థితిపై మంత్రి ఈటెల సమీక్ష..

150
minister etela
- Advertisement -

ఈ రోజు సీఎం ఆదేశాలు మేరకు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ – 19 ప్రస్తుత పరిస్థితి, చలికాలంలో కేసులు పెరిగితే కావాల్సిన ఏర్పాట్లు, వాక్సిన్ వచ్చిన తరువాత సరఫరా, నిల్వ వంటి అంశాలపై చర్చించారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. నవంబర్‌లో మన రాష్ట్రంలో చాలా తక్కువ కేస్ లు నమోదు అవుతున్నాయి. అత్యల్ప స్థాయిలో యాక్టీవ్ కేస్ లు ఉన్న మొదటి వారం ఇదే. ఇప్పటి వరకు మనం 50 లక్షలకు పైగా టెస్ట్ లు చేశాము. గత నాలుగు నెలలుగా టెస్ట్ లు పెంచడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కేస్ ల తగ్గుదల నమోదైంది.

జిహెచ్ ఎంసీ పరిధిలో 112892 కేస్ లు మాత్రమే నమోదు అయ్యాయి. నవంబర్ లో జిహెచ్ఎంసీలో చాలా తక్కువగా 3.8 శాతం మాత్రమే పాజిటివ్ రేట్ ఉంది. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ కేస్ లు ఉన్నాయి. దేశంలో మొట్టమొదటి లాక్ డౌన్ తెలంగాణ లోనే.కేస్ లు ఎక్కువగా వున్న చోట కంటైన్మెంట్ చేసి వాళ్లకు నిత్యావసరాలు అందించాము. పండుగల సమయంలో ఆందోలన చెందినప్పటికి కానీ కేస్ ల సంఖ్య మాత్రం పెరగకపోవడం మంచి విషయం.ఇంకో రెండు మూడు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

శీతాకాలంలో శ్వాస కోశ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. టెస్ట్ లు మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. జిల్లాలకు కూడా ఆ మేరకు టార్గెట్ ఇచ్చాము. ఒక్కో రోజు 65 వేల వరకు టెస్ట్ లు చేసేందుకు ఏర్పాట్లు చేశాము. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల ల్యాబ్ లలో ఆర్ టి పీసీఆర్ టెస్ట్ లకు అనుమతులు వచ్చాయి. జిహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలు మాస్క్ ధరించి, బౌతిక్క్ దూరం పాటించేలా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. డీఎంఈ, డిహెచ్ కార్యాల అధికారులు జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ వస్తే చేస్తున్న సన్నాహాలు పరిశీలిస్తారని మంత్రి తెలిపారు.

- Advertisement -