రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపునిచ్చరు. ఈ మేరకు మంత్రి ఈటల ఈరోజు హుజురాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈరోజు నా పుట్టిన రోజు సందర్భంగా మా హుజురాబాద్ నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు. సంవత్సర కాలం నుండి కరోనా వైరస్ కారణంగా అందరం బాధపడుతున్నాము. దీనంతటికి కారణం వాతావరణంలో మార్పులు,పచ్చని వాతావరణంలో ప్రకృతితో కలిసి జీవించిన వారికి కరోనా వ్యాధి దరిచేర లేదు.. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి తెలిపారు.
అదేవిధంగా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు,అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మొక్కలు నాటి నాకు శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని చెప్పిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి ఈటల గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్‌తో కలిసి మంత్రులు ఈటల రాజేందర్,హరీష్ రావు, జగదీష్‌రెడ్డితో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ షేర్ చేస్తూ.. ఇదొక మధురమైన జ్ఞాపకం అంటూ.. ఎంపీ సంతోష్ పేర్కొన్నారు.