నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం..

246
Sonu Sood
- Advertisement -

నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా… వలసకూలీలు, ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు సోనూ సూద్. అయితే బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన విమానాలపై సోనూ సూద్ బొమ్మను చిత్రించింది. అంతేకాదు, సోనూ సూద్ ను ‘రక్షకుడు’గా అభివర్ణిస్తూ, ఆయనకు శాల్యూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కరోనా లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం విమానాలు పంపి స్వదేశానికి రప్పించాడు సోనూ సూద్‌. అలాగే వలసకూలీల కష్టాలను చూసి తీవ్రంగా స్పందించి వారి కోసం పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు తరలించారు. పేదవారికి అండగా నిలిచాడు నటడు సోనూ సూద్‌.

- Advertisement -