తెలంగాణలో కరోనా లేదు- మంత్రి ఈటెల

532
Minister Etela Rajender
- Advertisement -

రాష్ట్రంలో కరోనా ప్రభావంపై అసెంబ్లీ నుండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. కరోనా ఎయిర్ పోర్ట్ ను దిగ్బంధం చేయాలని ఒక్కరిని కూడా స్క్రీన్ చేయకుండా బయటికి పంపవద్దని శాంతి కుమారిని మంత్రి ఈటెల కోరారు.

అలాగే కరోనా సందర్భంలోనే కాకుండా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ, ఒస్మానియా, చెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్ ను సర్వ సన్నద్ధంగా ఉంచాలని మంత్రి కోరారు. రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వారితో కలిసిన వారిని ట్రాక్ చేస్తున్నామని మంత్రికి అధికారులు వివరించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు ఇటలీ నుండి, మరొకరు నెదర్లాండ్ నుండి వచ్చారు.

రాపిడ్ యాక్షన్ టీమ్ లతో పాజిటివ్ వ్యక్తులు కలిసిన వారందరికీ పరీక్షలు చేయనున్నామని అధికారులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో రిలాక్స్ అవ్వవద్దు అని కరోనా నియంత్రణకు కట్టుదిట్టమై చర్యలు చేపట్టాలని.. తెలంగాణ లోనున్నవారికి కరోనా వైరస్ వ్యాప్తి జరగలేదని మంత్రి తెలిపారు.

- Advertisement -