కరోనాపై సినిమా.. టైటిల్‌ ఎంటో తెలుసా..!

406
coronavirus
- Advertisement -

ప్రస్తుతం కరోనా (కొవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయానక వైరస్ గా పాపులరైంది. మూడు దేశాలు మినహా దాదాపు ప్రపంచాన్ని చుట్టేసింది ఈ మహమ్మారీ. శాస్త్ర వేత్తల మేథస్సుకే సవాల్ గా మారిన వైరస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా దీని భారిన పడిన వారిలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగడం భయపెట్టేస్తోంది. అయితే ఈ వైరస్ ఓ వైపు ప్రపంచాన్ని భయపెడుతుంటే మరోవైపు ఆ పేరుతో సినిమాలు తీసేందుకు వివిధ చిత్ర పరిశ్రమలు పోటీపడుతున్నాయి. కరోనా దెబ్బకు ఓవైపు సినిమాల విడుదల వాయిదా పడుతుంటే, మరోవైపు ఆ పేరును క్యాష్ చేసుకునేందుకు చిత్ర పరిశ్రమ పోటీ పడుతోంది.

ఈ క్రమంలో కరోనా పేరుతో టైటిల్ రిజస్ట్రేషన్ కోసం క్యూ కడుతున్నాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అయితే అందరికంటే ముందే ‘కరోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. టైటిల్ రిజస్టర్ కావడమే లేటన్నట్టు అప్పుడే స్క్రిప్టు పనులు కూడా మొదలయ్యాయి. దీనిని ఓ ప్రేమ కథగా తీయబోతున్నట్టు చెప్పిన నిర్మాణ సంస్థ.. పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు తెలిపింది. కరోనా పేరుతో మరికొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ అయినట్టు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపింది.

- Advertisement -