10 తేదీ కల్లా రాష్ట్రంలో కరోనా కేస్ లో తగ్గుతాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నేడు కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కమ్యనుల్ వైపు ఇంకా స్ప్రెడ్ కాలేదు. ఆ దిశగా వెళ్లకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా మార్కజ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ,ఇతర రాష్ట్రాలను అలెర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే అని మంత్రి అన్నారు.
మార్కజ్ వెళ్లి వచ్చిన వారందరిని ట్రేస్ చేయడం జరిగింది. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్ కరోన్ కోసం కేటాయించడం జరిగింది. తర్వాత దాని 1500 పడకల ఆస్పత్రిగా మారుస్తాం,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వైద్యలు ఊహించనంత పరికరాలు కొనడం జరిగింది. వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతిక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ అందోళ చెందోద్దు అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.