ఇంటింటికి ఆల్బండా జొల్ టాబ్లెట్లు: ఈటల

190
minister etela
- Advertisement -

దేశ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కార్యక్రమం జరుగుతోంది అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నులిపురుగులు ఉంటే, పిల్లల్లో ఎదుగుదల ఉండదు. వీటిని నివారించడానికి తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రతీ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి, ఆల్బండా జొల్ టాబ్లెట్స్ ఇస్తారు అని మంత్రి తెలిపారు.

ఇక కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పరిమితమైన వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఇతర సాధారణ సేవలు తిరిగి మొదలయ్యాయని మంత్రి తెలిపారు. కోవిడ్ డ్యూటీల్లో ఉన్న వాళ్లకు మాత్రమే, క్వారంటైన్ సెలవులు ఇస్తున్నామని.. కరోనా డ్యూటీల్లో లేని వైద్య సిబ్బంది రెగ్యులర్ డ్యూటీలకు హాజరు కావాల్సి ఉంటుంది మంత్రి స్పష్టం చేశారు.మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు మేరకు ఆరోగ్యశ్రీ లో మార్పులు చేస్తున్నామని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -