పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- మంత్రి ఈటల

311
minister etala
- Advertisement -

సర్కారు వైద్యంపై నమ్మకం పెరగడంతో ప్రసవాల సంఖ్య సర్కారు దవాఖానాలలో విపరీతంగా పెరిగిందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలుగురికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు అందించారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బండ శ్రీనివాస్‌, గోపు కొంరారెడ్డి, గందె శ్రీనివాస్‌, కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. నిరుపేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లవేళలా అండగా ఉంటుందని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుదని స్పష్టం చేశారు. నిరుపేదలకు సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని బస్టాండు ఆవరణలో నిర్మించిన పబ్లిక్‌టాయిలెట్స్‌ను మంత్రి ఈటల పరిశీలించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

- Advertisement -