చిన్నారి శ్రీనికకు మంత్రి ఎర్రబెల్లి ప్రోత్సాహం..

255
minister errabelli
- Advertisement -

గత నెల బెంగుళూరులో జరిగిన జాతీయ టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో సబ్ జూనియర్,12 సంవత్సరాల బాలికల విభాగంలో బంగారు పతకం సాధించిన నిజామాబాద్ జిల్లా నంది పేట మండలం తోండకురు గ్రామానికి చెందిన క్రీడాకారిణి శ్రీనికను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు.

క్రీడాకారిణి శ్రీనిక త్వరలో నేపాల్ దేశంలో ఖాట్మండులో జరిగే అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… శ్రీనిక అంతర్జాతీయ,జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు రాష్ట్రానికి తీసుకురావాలని,నాణ్యమైన శిక్షణ తీసుకొని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణి శ్రీనిక వెంట కోచ్ మాస్టర్ బి. హీరలాల్ వున్నారు.

- Advertisement -