తెలంగాణలో మందుల కొరత లేకుండా చూస్తామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. కొత్త స్కీములను అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పెద్దల్లో 81 నుంచి 76 కు ..పిల్లల్లో 39 నుంచి 28 కి తగ్గిందన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకుని డాక్టర్లను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం..దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ కంటే, గొప్పగా ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కిం లు అమలు చేస్తున్నాం. భూపాల పల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, సిరిసిల్ల, నిర్మల్, అసిఫాబాద్, గద్వాల, నారాయణ పెట్ లలో జిల్లా స్థాయి ఆస్పత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 9 జిల్లా స్థాయి ఆస్పత్రుల నిర్మాణం కోసం 214 కోట్ల రూపాయలు ఇవ్వటానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులన్ని భర్తీ చేస్తామన్నారు. రాబోయే కాలంలో వైద్యం కోసం ప్రజలు పదుతున్న ఇబ్బందులు లేకుండా అందరికి వైద్యం అందిస్తామన్నారు.
Minister Etela Rajendar Speech on Medicines In Telangana