కరోనా విషయంలో వదంతులు నమ్మొద్దుః మంత్రి ఈటెల

445
Minister Etela
- Advertisement -

కరోనా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. కరోనా వైరస్ పై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా చర్చించిందన్నారు. తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, ఈటెల, ఎర్రబెల్లి, సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి ఈటెల రాజెందర్ మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన చెందల్సిన అవసరం లేదని చెప్పారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు. కరోనా బాధిత వ్యక్తి తుంపర్లతోనే వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు, శుభ్రత పాటిస్తే సరిపోతుందన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై విసృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చోటే కరోనా వైరస్ జీవించే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కనుక వైరస్ వ్యాపించే అవకాశం తక్కువ ఉన్నట్లు చెప్పారు. మిలిటరీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ముందు జాగ్రత్తలపై హోర్డింగ్ లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. కరోనా కోసం 104 హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా విషయంలో కేంద్రప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. కావాల్సినన్ని మాస్క్ లు సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

- Advertisement -