మొక్కలు నాటిన మంత్రి ఈటెల రాజెందర్

465
etela
- Advertisement -

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

ఈ సందర్బoగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి… దీని ద్వారా కొన్ని కోట్ల మొక్కలు నాటే విధంగా ఎంతో మందిని ఇందులో భాగస్వామిని చేస్తూ ఇంత విజయవంతం కావడానికి కారణమైన ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయమని అన్నారు.

etela green

అంతేకాక మనం నాటే మొక్కలు మనకే కాక భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది అన్నారు. ఇంత మంచి కార్యక్రమంతో సంతోష్ కుమార్ భావితరాలకు మార్గదర్శకులుగా మారారు అన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలి అన్నారు. మొక్కలు నాటడం కాదు, అవి పెరిగి పెద్ద అయ్యేలా చూడాలి అన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో సేవ్ ట్రీస్ ఫౌండర్ విక్రాంత్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -