చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ

423
Chiranjeevi Nagarjuna
- Advertisement -

జూబ్లీహిల్స్ లోని సినీ నటుడు చిరంజీవి నివాసంలో సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున లతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.  సినిమా రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆయన చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు. కాగా, తన నివాసానికి వచ్చిన మంత్రి తలసానికి చిరు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి తలసానితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

chirutalasani

- Advertisement -