కేటీఆర్‌ కృషితో సిరుల ఖిల్లాగా సిరిసిల్ల: మంత్రి ఎర్రబెల్లి

235
errabelli
- Advertisement -

ఈ సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు చేనేతలు అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. చేనేత బిడ్డలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…చేనేత హస్త కళ, అద్భుత కళ, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలు అని తెలిపిన ఎర్రబెల్లి … తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసిఆర్ చేనేతల ను ఆదుకోవడానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు.

సిరిసిల్ల అంటే… ఉరి సిల్ల అని ఒకప్పుడు తాటికాయంత అక్షరాలతో మీడియా రాసేది కానీ కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాక సిరి సిల్ల సిరుల ఖిల్లా గా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని…దేశంలో చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ఏకైక సర్కారు తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

సీఎం కేసీఅర్ మార్గ నిర్దేశనం లో చేనేతలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు ప్రజలకు బహుమతిగా చేనేత బట్టలు పంపిణీ చేస్తుందని…చేనేతలకు మౌలిక, మార్కెటింగ్ వంటి సదుపాయాలు, సబ్సిడీలు కల్పిస్తుందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో చేనేత కుటుంబాలే ఎక్కువగా వున్నాయి…వాళ్ళందరి ఆదరాభిమానాలు తనకున్నాయని చెప్పారు. చేనేతలను గుర్తించి, చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తుం డటం గర్వకారణం అన్నారు.

- Advertisement -