కోవిడ్ బాధితులు మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు…

45
errabelli

కోవిడ్ బాధితులకు చికిత్స వ‌రంగ‌ల్‌లోని యం.జి.యం ఆసుప‌త్రిలో అన్ని ఏర్పాట్లు చెసింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. కరోనా బాధితులతో కిక్కిరిసిన కొవిడ్ వార్డును బుధ‌వారం ఆకస్మికంగా సంధ‌ర్శించి పరిశీలించారు. ఆసుప‌త్రిలోని కోవిడ్ వార్డులో పీపీఈ కిట్ వేసుకొని ప‌ర్య‌టించి కోవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స, స‌దుపాయాల‌పై ఆరా తీశారు.

ఆసుప‌త్రిలో చికిత్స పోందుతున్న బాధితులతో డాక్ట‌ర్లు స‌రిగా వైద్యం అందిస్తున్నారా… పౌష్టికాహారం అందుతుందా.. అంటూ. యోగ క్షేమాలు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుప‌త్రిలో ఆక్సిజన్, మందుల సరఫరా ఎలా ఉందంటూ వైద్యుల వద్ద ఆరా తీశారు. కోవిడ్ బారినప‌డి ఆసుప‌త్రికి వచ్చే బాధితుల‌కు మెరుగైన చికిత్స‌ అందించి ప్రాణాపాయం లేకుండా చూడాల‌ని వైద్యుల‌ను కోరారు. రోగుల ఆరోగ్య స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించి, అందుకు అవ‌స‌ర‌మైన మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సూచించారు. వ‌రంగ‌ల్ యం.జి.యం ఆసుప‌త్రిలో అన్ని వ‌స‌తులు క‌ల్పించి, మెరుగైన చికిత్స అందేవిధంగా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. కోవిడ్ విచ్చిన బాధితులు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు పోయి ఆర్ధికంగా న‌ష్ట‌పోకుండా ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న మంత్రి.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

యంజియం ఆసుప‌త్రిలో 800 ప‌డ‌క‌ల‌ను అందుబాటులో ఉంచి పూర్తిస్థాయి కోవిడ్ వైద్యసేవ‌ల‌కు ఉప‌యోగిస్తున్న‌ట్లు చెప్పారు. అందులో 650 అక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌తో సిద్దంగా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం 400 మంది కోవిడ్ బాధితులు చికిత్స పోందుతున్నార‌ని తెలిపారు. ఆసుప‌త్రిలో అక్సిజ‌న్ నిల్వ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, రెమిడీసివీర్ ఇంజ‌క్ష‌న్ల స‌ర‌ఫ‌రాపై ఆరోగ్య‌శాఖామంత్రి ఈటెల‌తో మాట్లాడారు. కోవిడ్ బారిన ప‌డ్డ వారు పరిస్థితి విష‌మించే వ‌ర‌కు చూడ‌టం వ‌ల్లే మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పారు. కేంద్రం స‌హాక‌రించ‌కున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి సారించింద‌న్నారు. రాష్ట్రంలోని 18 సంవ‌త్స‌రాలు నిండిన వారంద‌రికి ఉచితంగా వ్యాక్సిన్ వేసే విధంగా సియం కేసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. క‌రోన బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి నిరంతరం ముందుండి ప‌నిచేస్తున్న‌యం.జి.యం ఆసుప‌త్రి సూప‌రిండెంట్ నాగార్జున‌రెడ్డిని, డాక్ట‌ర్ల‌ను,పారా మెడిక‌ల్, పారిశుద్య‌ సిబ్బందిని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభినందించారు.