లాభసాటి పంటలతో రైతులకు మేలు: మంత్రి ఎర్రబెల్లి

353
errabelli
- Advertisement -

లాక్ డౌన్ సమయం లోనూ నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దొరికిన విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన వ్యవసాయక్షేత్రంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా శనివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషాతో కలిసి వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి …తన వ్యవసాయ క్షేత్రం లోని మొక్కలను, చెట్లను, పంటలను పరిశీలిస్తూ ఇంకేమైనా పంటలు వేస్తే ఎలా వుంటుంది అనే దానిపై ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి సమాలోచనలు జరిపారు.స్వతహాగా రైతు అయిన మంత్రి ఆయా పంటల విషయంలో క్షేత్రంలో పని చేస్తున్న కార్మికులకు తగు సూచనలు చేశారు.పంటల సాగుబడి తీరుని పరిశీలించారు.క్షేత్రంలో కూలీలను పలకరించి, పనులు సాగుతున్న వైనాన్ని ఆరా తీశారు.

క్షేత్రం సమీపంలో పనులు చేసుకుంటున్న రైతులు, వారి పిల్లలను పలకరించారు.కరోనా వైరస్ విస్తృతి నీ వివరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల ను తెలిపారు.అలాగే వాళ్లకు మాస్కుల ను పంపిణీ చేశారు.కరోనా నుంచి ఎవరికి వారే కాపాడుకోవాలని సూచించారు.ఇష్టానుసారం తిరగకుండా, ఈ సమయాన్ని సొంత పనులు, వ్యవసాయ పనులకు కేటాయించాలన్నారు.కుటుంబ జీవనం అద్భుతమని, వ్యవసాయం లో ఉన్న ఓ తృప్తి ఉందన్నారు.

పచ్చని చేను, చెలకలు ఆహ్లాదాన్ని ఇస్తాయని, ఆయుషు ను పెంచుతాయని..సీఎం కేసిఆర్ చెప్పినట్లు రైతులు నియంత్రిత పంటలను సాగు చేయాలన్నారు. లాభసాటి పంటలతో రైతులు బాగుపడాలి…రైతులను రాజును చేయాలనేది సీఎం కేసిఆర్ లక్ష్యం అన్నారు.

- Advertisement -