అల్లరి నరేష్‌ 57 @ నాంది

297
allari naresh
- Advertisement -

ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా వెండితెరకు పరిచయమైన హీరో అల్లరి నరేష్. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నరేష్…కొంతకాలంగా ఏ చిన్న పాత్ర వచ్చిన సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు 56 సినిమాలు చేసిన నరేష్…తాజాగా తన 57వ చిత్రానికి ‘నాంది’ పలికారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు నరేష్. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉండే నరేష్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లరి నరేష్ బర్త్‌ డే జూన్ 30కి ఒకరోజు ముందు సర్‌ప్రైజ్ ఇచ్చిన నిర్మాతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

- Advertisement -