సీఎం కేసీఆర్ బర్త్ డే కానుక..మొక్కలు నాటండి

109
errabelli dayakarrao
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటి ఆయనకు కానుకగా వాటిని సంరక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా (పాలకుర్తి నియోజకవర్గం) తొర్రూరులోని పార్టీ ఆఫీసులో తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల ముఖ్య నాయకులతో, పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకులతో వేర్వేరుగా మంత్రి బుధవారం సమావేశమయ్యారు. సమకాలీన పాలన, రాజకీయాలపై ముఖ్య నేతలకు అవగాహన కల్పించి చైతన్య పరిచారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, తెలంగాణను బంగారు మయం చేయడానికి కంకణం కట్టకుని పని చేస్తున్న సీఎం, రైతు, దీన జన బాంధవుడు కెసిఆర్, ఎంతో శ్రద్ధతో హరిత హారం వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాంటి సీఎం పుట్టిన రోజున ఆయనకు కానుకగా, పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని మంత్రి ముఖ్య నేతలకు విజ్ఞప్తి చేశారు. రికార్డు సృష్టించేలా మొక్కలు నాటాలని, ఇందుకు పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలను సమాయత్తం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -