ప్రజలంతా భౌతిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, కంటాయపాలెం, మడిపల్లె గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎర్రబెల్లి. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముంబాయి నుంచి ఈ మధ్య వచ్చిన వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చిందని…అమ్మాపురంలో ఒకరికి, కంఠాయపాలెం, మడిపల్లెల్లో రెండు కేసులు చొప్పున పాజిటివ్ వచ్చినట్లుగా మంత్రికి వివరించారు అధికారులు.
ఈ దశలో ప్రజల్లో ధైర్యం కల్పించి, భయపడాల్సిన పనిలేదని, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ, ఎవరికి వారు లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించాలని సూచించారు మంత్రి ఎర్రబెల్లి.
స్వీయ నియంత్రణలో ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మినహా మరొకరికి కూడా రాకుండా ఆ గ్రామాలను క్వారంటైన్ చేయాలని, ప్రజలకు అవగాహన చైతన్యపరుస్తూండాలని చెప్పారు ఎర్రబెల్లి.
గ్రామాల్లో వాలంటీర్లను నియమించి, వారి ద్వారా ప్రజావసరాలు తీర్చాలన్నారు. ఇలాంటి సమయంలో గ్రామాల్లోని నేతలు, ప్రజలకు అండగా నిలవాలి… ఆదుకోవాలన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సిన పనిలేదు. ధైర్యంగా ఉండాలి…ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు.