పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం: ఎర్రబెల్లి

124
dayakarrao
- Advertisement -

రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రంలోని ఎంపిక చేసిన 19 ప్రభుత్వ ఆసుపత్రిలలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయని, అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ,ములుగు,మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుప్రతులలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించినందుకు రాష్ట్ర పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకు రావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అయన తెలిపారు.

కరోనా నిర్దారణ పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షలకు కూడా పేదల అవస్థలు పడుతున్న పరిస్థితులలో వైద్యం అందించడంమంటే కేవలం డాక్టర్లు, ఔషదాలు మాత్రమే కాదని, పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం భావించిందని, అందులో భాగంగానే తక్షణమే 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని ఆయన తెలిపారు. గత పాలకుల పాలనలో ఆగమైన వైద్యరంగాన్ని ఆనతికాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవింపచేసిందని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాలలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సాధారణ పరీక్షలు కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా చేసి వెంటనే రిపోర్టులు ఇస్తారని అయన తెలిపారు. నిర్దారించిన రిపోర్టులు ఆయా రోగుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎం ఎస్ రూపంలో పంపించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభత్వం చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.

- Advertisement -