జూన్ 7 నుంచి అన్‌లాక్‌…రాష్ట్రాలు ఇవే..!

26
india

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి. పాజిటివిటీ రేటు, జూన్ 3 ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ స్థాయి ఆధారంగా జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.

మహారాష్ట్రలో కరోనా ఆంక్షల్లో 5-లెవల్ ప్లాన్ ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రతి మునిసిపల్ ప్రాంతం, జిల్లాను ప్రత్యేక పరిపాలనా విభాగంగా పరిగణించారు. వ్యవసాయం, తయారీ రంగం, ఆర్థిక కార్యకలాపాలు కూడా అనుమతి ఉంటుంది. లెవల్-2 భాగంలో నగరాలు, జిల్లాలు పాజిటివిటి రేటు 5శాతం, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 25 నుంచి 40శాతంగా ఉంటుంది. మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఆడిటోరియంలు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.

జూన్ 7న ఢిల్లీ ప్రభుత్వం బేసి సంఖ్యలో కొన్ని షాపులు మరుసటి రోజు తెరుచుకోవడం, సరి సంఖ్యలో షాపులు ఒక రోజున తెరిచేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. మార్కెట్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు తెరవడానికి అనుమతి ఉంటుంది.

గుజరాత్ లోని 36 నగరాల్లోని అన్ని దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ల ద్వారా హోమ్ డెలివరీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, జూన్ 7 నుండి 100% సిబ్బందితో కార్యాలయాలు పనిచేసేందుకు గుజరాత్ అనుమతించింది.

ఉత్తర ప్రదేశ్ యాక్టివ్ కేసులు 600 కన్నా తక్కువ నమోదైన జిల్లాల్లో ఆంక్షలను సడలించింది. ఆ జిల్లాల్లో,కంటైనర్ జోన్ల వెలుపల మార్కెట్లు, దుకాణాలు సోమవారం నుండి శుక్రవారం వరకు తెరిచి ఉంటాయి.

తమిళనాడు కొవిడ్ లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగించింది. అయితే చెన్నైతో సహా 27 జిల్లాల్లో లాక్ డౌన్‌ ఆంక్షలను సడలించింది. ఒడిశా గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు తగ్గడంతో ఒడిశా ప్రభుత్వం నువాపాడా, గజపతి, సుందర్‌గా జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలను తగ్గించింది.