వృక్ష వేదం అద్భుత గ్రంథం: మంత్రి ఎర్రబెల్లి

186
errabeeli dayakarrao
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ వృక్ష వేదం పుస్తకాన్ని సోమవారం అందించారు. ప్రగతి భవన్ లో పంచాయతీరాజ్ విభాగంపై జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రగతి భవన్ వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఎంపీ సంతోష్ ఈ పుస్తకం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడు తూ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో దేశంలోనే అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్నారని, ఇదే కోవలో ఎంపీ సంతోష్, సీఎం గారి ని అనుసరిస్తూ, గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్త కార్యక్రమంగా మారిందని అనేక మంది ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ, మరికొందరికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ, మొక్కలు నాటుతూ పర్యావరణానికి పాటు పడుతున్నారని మంత్రి అన్నారు. అలాగే మొక్కలు, వాటి విలువ, వేదాల్లో ఉన్న వాటి ప్రాశస్త్యం నేటి ప్రజలకు అందే విధంగా రూపొందించిన వృక్ష వేదం అద్భుత గ్రంథం అని అభినందించారు.

- Advertisement -