విజయ్ దేవరకొండ..మా ఫ్యామిలీ మెంబరే

123
- Advertisement -

విజయ్ దేవరకొండ మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన ఎర్రబెల్లి…వరంగల్ వచ్చిన ప్రతిసారి విజయ్ మా ఇంటికి వస్తారని వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చారని తెలిపారు.

పూరీజగన్నాథ్ సినిమాలు బాగా తీస్తాడని.. అతడు ఏ సినిమా తీసినా వరంగల్ నుంచే ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఛాయిస్ అవ్వాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. వరంగల్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందని.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఎర్రబెల్లి అన్నారు.

వరంగల్ నగరం గతంలో లాగా లేదని.. కాకతీయుల కాలం నాటి కట్టడాలను తాము బాగుచేస్తున్నామని, సినిమా వాళ్లందరూ వరంగల్‌లో తప్పకుండా సినిమా షూటింగులు జరుపుకోవాలని ఎర్రబెల్లి కోరారు.

- Advertisement -