- Advertisement -
పాలకుర్తిలో పిల్లలతో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీసీ రోడ్లు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి నడుస్తుండగా హోలీ ఆడుతూ పిల్లలు ఎదురురాగా వారితో కలిసిపోయిన మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ రంగులు పూయించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభకాంక్షలు తెలిపారు ఎర్రబెల్లి.హోలీ రంగుల పండుగ అనీ, ప్రజల జీవితాలు కూడా రంగుల లాగే అన్ని రకాల అనుభవాలు,అనుభూతులు కూడా ఉంటాయని అన్నారు.
ఈ హోలీ ప్రజల జీవితాలను రంగులమయం చేయాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల జీవితాలు బంగారు మయం అవుతాయని అన్నారు. తాజా బడ్జెట్ కూడా సకల ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతిబింబించింది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
- Advertisement -