హోళీ వేడుకల్లో విషాదం

11
- Advertisement -

హోళీ వేడుకల్లో విషాదం నెలకొంది. మధ్యప్రదేవ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 5గురు పూజారులతో పాటు ఎనమిది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భస్మ హారతి సమయంలో మహాకాల్‌కి గులాల్‌ సమర్పిస్తున్నప్పుడు ధూలెండి కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని పూజారి తెలిపారు. భస్మహారతి సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగిందని చెప్పారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ .

ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని…ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు సీఎం మోహన్ యాదవ్. గాయపడినవారికి చికిత్స అందించడానికి స్థానిక అధికారులు సహాయం చేస్తున్నారని వెల్లడించారు.

Also Read:IPL 2024 :పాయింట్స్ టేబుల్..వివరాలివే!

- Advertisement -