ప్రణాళికా బద్ధంగా వరంగల్ అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

16
dayakar rao

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండలం వరికోల్ గ్రామంలో సర్వదేవత బొడ్రాయి శిల, భూలక్ష్మి, మహాలక్ష్మి యంత్ర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైతు వేదిక భవనాలను పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి… వరంగల్ అభివృద్ధికి సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఎంతో చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజూ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. వరంగల్ నగరానికి ఇప్పటి వరకు కేవలం 130 కోట్లు మాత్రమే ఇచ్చారని, అనేక సార్లు అదే విషయాన్ని వల్లిస్తున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లతో వరంగల్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిడ్డుతున్నదని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా నిధులు రాష్ట్రానికి ఇవ్వకపోయినా అభివృద్ధి ఆగకుండా పని చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేసిన ఎర్రబెల్లి…హుందాగా వ్యవహరించాలని, విమర్శలు, మాటలు గౌరవంగా ఉండాలని హితవు పలికారు.