భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ..

97
errabelli
- Advertisement -

భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ చేపడతామన్నారు మంత్రులు. హైదరాబాద్ బీఆర్కె భవన్ లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై సమీక్షనిర్వహించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జెన్కో ఆద్వర్యంలో పెరిగిన పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.

57 లక్షలకు నూతన కనెక్షన్లు పెరగడంతో పాటు 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. కరోనాలోను అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేపడతామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ పటిష్టీకరణకు 33,722 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,623 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెంపు చేపట్టామన్నారు.

రెండు లక్షల కిలో మీటర్ల పైగా విద్యుత్ లైన్లు పెరిగాయన్నారు. కొత్తగా 1000 33/11 కెవి సబ్ స్టేషన్లు , అదనంగా 2వేల పవర్ ట్రాన్స్ ఫార్మర్స్,మూడు లక్షలకొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 168 లక్షల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేపడుతున్నామని…నాణ్యమైన ఉచిత విద్యుత్ ను 24 గంటలు వ్యవసాయ రంగానికి అందించే ఏకైకరాష్ట్రం తెలంగాణ అన్నారు.

- Advertisement -