దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాఠశాలలు- మంత్రి ఎర్రబెల్లి

124
- Advertisement -

రాష్ట్రంలోని పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థుల సంఖ్యను పెంచి, నాణ్యమైన విద్యను అందించి, వారిని సమున్నతంగా తీర్చిదిద్దేందుకు, వారికి కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో సీఎం కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో భాగంగా, ఆ కార్యక్రమంపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… జనగామ జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంపై జనగామ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్ జమున, జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డీఈఓ, విద్యా, వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

ముందుగా అధికారులు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. స్కూల్స్ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలుపై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 508 స్కూల్స్ ఉండగా 176 స్కూల్స్ ని ఎంపిక చేశారు. ఇందులో 100 ప్రాథమిక, 19 ప్రాథమికోన్నత, 57 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం స్కూల్స్ లో ఎంపిక చేసిన 35 శాతం స్కూల్స్ లో 70 శాతం విద్యార్థులు కవర్ అవుతున్నారు.

- Advertisement -