అభివృద్ధిలోనూ “వావ్ వ‌రంగల్” అనిపిస్తాం: ఎర్ర‌బెల్లి

401
Minister Errabelli Dayakar Rao
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా:వావ్ వ‌రంగ‌ల్‌ని ఆవిష్క‌రించి, ప్రారంభించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చారిత్ర‌క‌, సాంస్కృతిక వైభ‌వాల వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని మ‌రింత‌గా అభివృద్ధి ప‌రిచి వావ్ వ‌రంగ‌ల్ అని పిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అన్ని రంగాల్లోనూ అద్భుత పురోగ‌తిని చూపిస్తామ‌న్నారు. అపూర్వ వైభ‌వం తేవ‌డం ద్వారా ప్ర‌జ‌లంతా వ‌రంగ‌ల్ ని చూసి వావ్ వ‌రంగ‌ల్ అని తీరాల్సిన ప‌రిస్థితిని తీసుకువ‌స్తామ‌ని మంత్రి తెలిపారు.

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఫాతిమా జంక్ష‌న్‌లో హైద‌రాబాద్‌లో ట్యాంక్ బండ్ మీద రూపొందించిన ల‌వ్ హైద‌రాబాద్ త‌ర‌హాలో… వ‌రంగ‌ల్ మున్సిపల్ కార్పొరేష‌న్ ప్ర‌త్యేకంగా రూపొందించిన వావ్ వ‌రంగ‌ల్‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్ తో క‌లిసి ఆవిష్క‌రించి, ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ అంటే ఓ చ‌రిత్ర‌, వ‌రంగ‌ల్ అంటే అభివృద్ధికి, గొప్ప సంస్కృతికి, గొలుసుకంట్టు చెరువుల‌కు, స‌హ‌జ సిద్ధ‌మైన రిజ‌ర్వాయ‌ర్ల‌కు ఓ ఐకాన్. ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూనే, పూర్వ వైభ‌వాన్ని ఇనుమ‌డింప చేస్తూ, అపూర్వ వైభ‌వాన్ని తెస్తామ‌న్నారు. ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌, అద్భుత క‌ట్ట‌డాలు, దేవాల‌యాలు, తెలంగాణ సంస్కృతికి ప్ర‌తిబింబంగా నిలిచాయ‌న్నారు.

అలాగే, ఒక‌ప్పుడు అజంజాహీ మిల్లు, ఇప్పుడు అప్పారెల్, ఐటీ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లు, రైల్వే జంక్ష‌న్‌, విస్తార‌మైన న‌గ‌రం, విద్యా అవ‌కాశాలు, రాష్ట్ర రాజ‌ధానికి రెండో రాజ‌ధానిగా వ‌రంగ‌ల్ ఉంద‌న్నారు. అటు సిఎం కెసిఆర్, ఇటు మంత్రి కెటిఆర్ లు వ‌రంగ‌ల్ అభివృద్ధికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లో అవుట‌ర్ రింగ్ రోడ్డు పూర్తి అయి, మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు రావ‌డానికి ఆస్కారం ఉంద‌న్నారు. నిజంగానే ప్ర‌జ‌లు వ‌రంగ‌ల్ ని చూసి వావ్ వ‌రంగ‌ల్ అనే ప‌రిస్థితిని తెస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్‌ను ఐటి హబ్‌గా, ఇండస్ట్రీస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి అన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం. కరోన వల్ల అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. త్వరలోనే భద్రకాళి బండ్ ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. హైదరాబాద్ కంటే వరంగల్‌కు ఎక్కువ చరిత్ర ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -