విశాల్..బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్

91
vishal
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్ , మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఎనిమి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధించింది. ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది. విశాల్ హీరోగా ఎస్ వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతన్నారు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఈ రోజు ప్రకటించారు.

విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారు. భారీ ఎత్తున నిర్మించబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.

- Advertisement -