షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను ప్రారంభించిన ఎర్రబెల్లి..

43
errabelli

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో స్వీపింగ్ యంత్రాలు, ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను ప్రారంభించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

మ‌రింత ప‌రిశుభ్రంగా, స‌ర్వాంగ సుంద‌రంగా వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర పారిశుద్ధ్యంలో భాగంగా రోడ్ల‌ను శుభ్రం చేయ‌డానికి వీలుగా కొనుగోలు చేసిన రెండు స్వీపింగ్ మిషన్లు, ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో వరంగల్ న‌గ‌ర మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, రాజ్య‌స‌భ స‌భ్యులు బండ ప్ర‌కాశ్, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ ప‌లువురు కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.