సంగెంలో రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి…

23
errabelli

రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గావిచెర్ల గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు….తాము పండించిన పంటను గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటాయో రైతులంతా కలిసి చర్చించుకునేందుకు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. దీంతో పాటు వ్యవసాయ సంబంధ విషయాలు చర్చించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.