గమనం @ 4 మిలియన్ వ్యూస్

45
sriya

సుజ‌నా రావు ద‌ర్శ‌కత్వంలో శ్రీయా ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ‌మ‌నం’. రియ‌ల్ లైఫ్ డ్రామాతో పాన్ ఇండియా మూవీగా పొందుతోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్..గమనం ట్రైలర్‌ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు 4 మిలియన్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళ‌యారాజా సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు.వి.ఎస్‌. జ్ఞాన‌శేఖ‌ర్ ఒక‌వైపు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూనే, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు అన్ని వైపుల నుండీ అనూహ్య‌మైన రెస్పాన్స్ ల‌భించింది.